Australia: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌కు దీర్ఘకాలిక వ్యాధి..

Written by Rudra

Published on:

ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. తనకు ఎప్పటినుంచో ఒక దీర్ఘకాలిక వ్యాధి ఉందని ఇప్పటివరకు ఆ విషయాన్ని దాచి పెట్టానని వివరించాడు.

Australia: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌కు దీర్ఘకాలిక వ్యాధి..

వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ కామెరూన్ గ్రీన్ తాను చిన్నప్పటి నుంచే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని అయితే ఆ వ్యాధి  పూర్తిగా నయం కాని వ్యాధి అని ఇటీవల ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తనకు కిడ్నీ సమస్య ఉందని, చిన్నతనం నుంచే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నానని తన తల్లి 19 వారాల ప్రెగ్నెన్సీ సమయంలో తనకు ఈ వ్యాధి ఉన్నట్లు గుర్తించారని  ఈ వ్యాధిని ఆల్ట్రా సౌండ్ తోనే గుర్తించాల్సి ఉంటుందని తెలిపాడు.  ఇతరులకు కిడ్నీల మాదిరిగా తన కిడ్నీలు పనిచేయవని, తన కిడ్నీలు 60% మాత్రమే పని చేస్తాయని తాను స్టేజ్ 2 లో ఉన్నట్లు కామెరూన్ గ్రీన్ తెలిపాడు.

అయితే తన తండ్రి నేను ఎక్కువ రోజులు బతకనని  తెలిసినా  క్రికెట్ కోచింగ్ ఇప్పించి ఆటలో రాటుతేలేలా కృషి చేశాడు. కామెరూన్ గ్రీన్ పుట్టిన తర్వాత చాలా రోజులు ఇంకుబేటర్ లో ఉంచామని తన తండ్రి వివరించాడు.. ప్రస్తుతం కామెరూన్ గ్రీన్ ఆస్ట్రేలియా తరఫున అన్ని ఫార్మేట్ లలో క్రికెట్ ఆడుతున్నాడు. 2022లో టి20 లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఇతను ఇటీవల జరిగిన ప్రపంచ కప్ లో భారత్ పై ఆస్ట్రేలియా గెలిచిన జట్టులో ఇతను కూడా సభ్యుడు. ప్రస్తుతం పాకిస్తాన్లో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో కామెరూన్ గ్రీన్ ఆడుతున్నాడు. ఇక ఐపిఎల్ లో వచ్చే సీజన్లో RBC తరఫున ఆడనున్నాడు..అయితే  కామెరూన్ గ్రీన్ ఇలా ఒక వ్యాధితో బాధపడటం నిజంగా క్రికెట్ అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఏదైనా ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధితో  ఇంత ఉన్నతంగా రాణిస్తున్న కామరూన్ గ్రీన్ నిజంగా ఒక అద్భుతం అని చెప్పాలి..

apnewshub.com 

Leave a Comment