ap news: ఆంధ్రప్రదేశ్లో పేద విద్యార్థులను ఉన్నత వర్గాల పిల్లలతో సమానంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన, CBSC అమలు వంటి అత్యున్నత స్థాయి అడుగులు పడుతున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మరియు ఎయిడెడ్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న 4, 34,185 మంది విద్యార్థులకు సుమారుగా 620 కోట్ల వ్యయంతో ఉచితంగా టేబుల్ పంపిణీ కార్యక్రమాన్ని డిసెంబర్ 21వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టనుంది ..ఈ కార్యక్రమాన్ని నేడు డిసెంబర్ 20న అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంచనంగా ప్రారంభించారు..
ఆంధ్రప్రదేశ్లో నేడే రెండో విడత 8వ తరగతి విద్యార్థులకు TABల పంపిణీ
దాదాపుగా 17500 పైగా ట్యాబ్ లను 8వ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థికి అందజేయనున్నారు.. అలాగే వారికి విద్య బోధిస్తున్న ఉపాధ్యాయులు కూడా ట్యాబులు అందజేయనున్నారు.. దీనిలో 8వ తరగతి విద్యార్థులు పై తరగతులకు వెళ్ళినప్పుడు కూడా ఉపయోగపడేలా ఎనిమిదో తరగతితో పాటు తొమ్మిది, పదో తరగతి కంటెంట్ను అప్లోడ్ చేసి ఉన్నారు. ఈ ట్యాబ్లో ఇంటర్మీడియట్ కంటెంట్ కూడా అప్లోడ్ చేసేలా మెమరీ కార్డు సామర్థ్యం 256 GB అందిస్తున్నారు. దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ (AI) తో పాటు.. పిల్లలు సులభంగా విదేశీ భాషలు నేర్చుకునేలా డ్యులింగో యాప్ ఇన్స్టాల్ చేయబడింది.. ఇది ఆన్లైన్ తో పాటు ఆఫ్ లైన్ లో కూడా పనిచేస్తుంది..
ఆంధ్రప్రదేశ్లో విద్యా విప్లవం
జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి విద్యావస్థ పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.. పాఠశాలలో నాడు – నేడుతో స్కూల్ రూపురేఖలు పూర్తిగా మార్చి వేశారు.. అత్యున్నత స్థాయి ఫర్నిచర్, ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అమలు, అత్యధిక టెక్నాలజీని ఉపయోగించి పాఠాలు బోధించేందుకు వీలుగా టీవీలు మరియు IFB పానెల్ లను కూడా ప్రభుత్వం సమకూరుస్తుంది.. 8వ తరగతి విద్యార్థులకు రెండో విడతగా ఈ సంవత్సరం ట్యాబ్లను అందిస్తున్నారు.. జగనన్న విద్యా కానుక పేరుతో వారికి కావాల్సిన పుస్తకాలు బట్టలు, షూస్, బ్యాగు వంటివి పాఠశాల తెరిచిన రోజునే అందిస్తున్నారు.. విద్యార్థులు MDM మెనూలో కూడా చాలా మార్పులను తీసుకొని రావడం జరిగింది..
education lo ys jgan garu chesinatlu e cm koda cheyaledu… prathipakshalu annee abaddhalu asatyalu pracharam chesthunnayi