ఇటీవల ఏ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నా అక్కడ ఇచ్చే హామీల్లో ప్రధానంగా కనిపిస్తున్న హామీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..
మొదట కర్ణాటకలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాత తెలంగాణలో సైతం ఇదే హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా విజయం సాధించింది. ఈ రెండు రాష్ట్రాల్లో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ హామీని వెంటనే అమలు చేయగలిగారు. దీనితో ఆంధ్ర ప్రదేశ్ అధికార పార్టీ అయిన వైసీపీ కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపైన ఆలోచన చేస్తుంది..
APలో మహిళలకు గుడ్ న్యూస్.. సంక్రాంతి నుంచి ఉచిత బస్సు ప్రయాణం..
బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించడానికి రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. ఈ పథకాన్ని మొదటి కర్ణాటకలో ప్రారంభించారు. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అమలు చేసింది… ఇటీవల టిడిపి తన ఎన్నికల హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే గ్యారెంటీ చేర్చింది. దాంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న YCP ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా దీని అమలుపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సంక్రాంతి నుంచి దీనిని అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి..
అయితే ఉచిత బస్సు ప్రయాణం పథకంపై మహిళల్లో మంచి స్పందన కనిపిస్తుంది. కర్ణాటక, తెలంగాణలో ఈ హామీ బాగా వర్కౌట్ అయింది. దీంతో ఏపీలోనూ మహిళలకు ఈ బస్సు ఉచిత బస్సు ప్రయాణం పైన చర్చ స్టార్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్లో ఇంకో నాలుగు నెలల్లో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఈ హామీని టీడిపి ప్రకటించగా దీనిపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. ఏపీలో ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపైన ఇప్పటికే సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఉన్నతాధికారులు నియమించినట్లు తెలుస్తుంది. దీనిపై ప్రభుత్వానికి త్వరలో వారు నివేదిక ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం. సంక్రాంతి పండుగ నుండి దీన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.
ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో నిత్యం సగటున 40 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 15 లక్షల వరకు మహిళలు ఉంటారని అంచనా.. అన్ని రకాల పాసులు కలిగిన వారు 10 లక్షల మంది ఉంటారు . అయితే ఈ హామీని అమలు చేస్తే ఏ మేరకు భారం పడుతుంది!! ఆర్టీసీకి ఎంత రాబడి తగ్గే అవకాశం ఉంది!!.. ప్రభుత్వం ఎంత మేరకు భరించాల్సి వస్తుంది!! అనే దానిపైన ఒక అంచనాకు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం అమలులోకి వస్తే మహిళలకు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మాదిరిగానే ఉచిత ప్రయాణానికి అవకాశం ఉంటుంది..