ఏపీలో టెన్త్,ఇంటర్ పరీక్షలు ఎప్పుడంటే..

Written by Rudra

Published on:

AP exams: ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ నెలలో సాధారణ ఎన్నికలు ఉన్న కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోఇంటర్ మరియు 10వ తరగతి పరీక్షలను..

ఏపీలో టెన్త్,ఇంటర్ పరీక్షలు ఎప్పుడంటే..

పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ నెలలో సాధారణ ఎన్నికలు ఉన్న కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోఇంటర్ మరియు 10వ తరగతి పరీక్షలను.. మార్చి నెలలోనే నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారు తెలిపారు.

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు ఎప్పుడంటే..

గురువారం మధ్యాహ్నం ఆయన విజయవాడలో పరీక్షల షెడ్యూల్ను విడుదల చేయడం జరిగింది. టెన్త్ ఆరు లక్షల మంది. ఇంటర్ 10 లక్షలు మంది మొత్తం 16 లక్షల మంది  విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. అందుకే ఏప్రిల్ లో సాధారణ ఎన్నికలు ఉన్న కారణంగా మార్చి నెలలోనే పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి1 వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షల సమయాన్ని నిర్ణయించారు. మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు  జరుగునున్నట్లు ఈయన తెలిపారు. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12:45 నిమిషాల వరకు పరీక్షల సమయం నిర్ణయించడం జరిగింది. విద్యార్థులందరూ 100% ఫలితాలు సాధించాలని మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఆకాంక్షించారు..ఏడు సబ్జెక్ట్ లకే టెన్త్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు..

10వ తరగతి పరీక్షల షెడ్యూల్:

  • మార్చ్ 18న ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1
  • మార్చ్ 19 న సెకండ్ లాంగ్వేజ్
  • 20 న ఇంగ్లీష్,
  • 22 తేదీ లెక్కలు,
  • 23 న ఫిజికల్ సైన్స్,
  • 26 న బయాలజీ,
  • 27 న సోషల్ స్టడీస్ పరీక్షలు
  • 28 న మొదటి లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ ఓఎస్ ఎస్ ఇ మెయిన్ లాంగ్వేహ్ పేపర్ -1
  • 30 న OSSE మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ( సంస్కృతం, అరబిక్,పర్షియన్), వొకేషనల్ కోర్సు పరీక్ష

apnewshub.com 

 

 

 

Leave a Comment