ప్రస్తుతం రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా TDB అయ్యప్ప స్వామి భక్తులకు ఆనందం కలిగించే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి సమయాన్ని ఒక గంట సేపు పొడిగించింది.
sabarimala: ప్రస్తుతం రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా TDB అయ్యప్ప స్వామి భక్తులకు ఆనందం కలిగించే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి సమయాన్ని ఒక గంట సేపు పొడిగించింది. ప్రస్తుతం రోజూ సాయంత్రం 4గంటల నుండి రాత్రి 11 గంటల వరకు భక్తులు అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. ఇకపై మధ్యాహ్నం 3 గంటల నుండి దర్శనాలు మొదలై రాత్రి 11 గంటల వరకు జరుగుతాయి అని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (TDB) తెలియపరిచింది. దీనివలన ఒక గంట సమయం అదనంగా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం అయ్యప్ప స్వామి మాలను ధరించేవారు అధికంగా ఉండే రోజులు ఇవి.. కనుక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని దేవస్థానం బోర్డు వారు తెలియపరిచారు.