రిలీజ్ కి ముందే నాని సినిమాకి భారీ లాభాలు.. అదిరిపోయే రేటుకు హాయ్ నాన్న OTT రైట్స్..

Written by Rudra

Published on:

రిలీజ్ కి ముందే నాని సినిమాకి భారీ లాభాలు.. అదిరిపోయే రేటుకు హాయ్ నాన్న OTT రైట్స్

నాచురల్ స్టార్ నాని నటించిన కొత్త సినిమా హాయ్ నాన్న. దసరా సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత నాని చేస్తున్న  “హాయ్ నాన్న”పై భారీగా అంచనాలు ఉన్నాయి.  ఈ నేపథ్యంలో హాయ్ నాన్న యొక్క OTT హక్కులు, హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయినట్లు సమాచారం.

రిలీజ్ కి ముందే నాని సినిమాకి భారీ లాభాలు.. అదిరిపోయే రేటుకు హాయ్ నాన్న OTT రైట్స్..
రిలీజ్ కి ముందే నాని సినిమాకి భారీ లాభాలు.. అదిరిపోయే రేటుకు హాయ్ నాన్న OTT రైట్స్..

 

నేచురల్ స్టార్ నాని నటించిన  కొత్త మూవీ హాయ్ నాన్నను వైరా ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ ప్రొడక్షన్ బ్యానర్ లో మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించారు.  కొత్త డైరెక్టర్ శౌర్యువ్  టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వపోతున్నాడు. హాయి నాన్నను ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా దర్శకుడు బాగా తీసినట్లు టాక్ నడుస్తుంది. ఇప్పటికే హాయ్ నాన్న “సమాయమా!”, ” గాజుబొమ్మ”  పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.


హాయ్ నాన్న సినిమాలో నాని సరసన సీతారామం ఫేం మృణాల్ టాగూర్ హీరోయిన్ గా నటిస్తుంది. దీనిలో శృతిహాసన్ ఒక స్పెషల్ సాంగ్  చేసింది.  హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7న తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా OTT రైట్స్  కళ్ళు చెదిరే ధరకు  అమ్ముడుపోయినట్లు టాక్ నడుస్తుంది. అన్ని భాషల్లో కలిపి డిజిటల్ రైట్స్ కింద Rs. 37 కోట్లకి అమ్ముడు పోయినట్లు సమాచారం. హిందీ డబ్బింగ్ అండ్  థియేటికల్ రైట్స్ ద్వారా రూ .7.5 కోట్లకు డీల్ దక్కినట్లు సమాచారం. దసరా తర్వాత నాని నటిస్తున్న హాయ్ నాన్న పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి..

apnewshub.com 

Leave a Comment