తుఫాను వలన కొన్ని జిల్లాల్లో పాఠశాలకు సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ కమీషనర్ ఉత్తర్వులు….

Written by Rudra

Published on:

కొన్ని జిల్లాల్లో ఇంకా  భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల,నెల్లూరు జిల్లాలోని పాఠశాలకు బుధవారం కూడా సెలవు ప్రకటిస్తూ

తుఫాను వలన కొన్ని జిల్లాల్లో పాఠశాలకు సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ కమీషనర్ ఉత్తర్వులు....

తుఫాను వలన కొన్ని జిల్లాల్లో పాఠశాలకు సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ కమీషనర్ ఉత్తర్వులు….

మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో అతి భారీ నుండి తీవ్ర భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమ,మంగళవారాలు పాఠశాలకు కొన్ని జిల్లాల్లో సెలవు ప్రకటించడం జరిగింది.

కొన్ని జిల్లాల్లో ఇంకా  భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల,నెల్లూరు జిల్లాలోని పాఠశాలకు బుధవారం కూడా సెలవు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు..  ప్రకాశం జిల్లాలో విద్యాశాఖ అధికారులు బడులు జరుగుతాయని తెలిపారు. తుఫాను నేపధ్యంలో బుధవారం కూడా సెలవు  పొడిగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

తుఫాను వలన కొన్ని జిల్లాల్లో పాఠశాలకు సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ కమీషనర్ ఉత్తర్వులు....

తీరం దాటిన మిచౌంగ్
బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాను బాపట్ల వద్ద తీరం దాటింది. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి తీరాన్ని తాకిన తుఫాను.. సాయంత్రం 4 గంటలకు తీరం దాటినట్టు వాతావరణ విభాగం వెల్లడించింది.. మిచౌంగ్ తుఫాను తీరాన్ని తాకడంతో సముద్రం అల్లకల్లోంగా మారింది. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో ఎక్కడకక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. భారీ వర్షాలతో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతింది. కాకినాడ జిల్లా జగ్గంపేటలో తుఫాన్ ప్రభావంతో బీభత్సం చేసింది . చెన్నై – కోల్‌కతా జాతీయ రహదారిపై టోర్నడో ఏర్పడింది. గండేపల్లి పెట్రోల్ బంక్ వద్ద సుడిగాలికి వరద నీరు పైకెగిసింది. సుడిగాలి బీభత్సానికి చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తునారు.

apnewshub.com 

Leave a Comment