గుట్కా ప్రకటన కేసులో ముగ్గురు బాలీవుడ్ అగ్రనటులకు  కేంద్రం షోకాజ్ నోటీసులు

Written by Rudra

Published on:

బాలీవుడ్ లో అగ్ర హీరోలైన షారుక్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ లకు కేంద్రం షోకాజు నోటీసును జారీ చేసింది..
గుట్కా కి సంబంధించిన వాణిజ్య ప్రకటనలో పాల్గొన్న దానిలో భాగంగా కోర్టులో దాఖలైన పిటిషన్ మేరకు ముగ్గురు బాలీవుడ్ అగ్రనతులకు కేంద్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

గుట్కా ప్రకటన కేసులో ముగ్గురు బాలీవుడ్ అగ్రనటులకు  కేంద్రం షోకాజ్ నోటీసులు

గుట్కా ప్రకటన కేసులో ముగ్గురు బాలీవుడ్ అగ్రనటులకు  కేంద్రం షోకాజ్ నోటీసులు

బాలీవుడ్ లో అగ్ర హీరోలైన షారుక్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ లకు కేంద్రం షోకాజు నోటీసును జారీ చేసింది..
గుట్కా కి సంబంధించిన వాణిజ్య ప్రకటనలో పాల్గొన్న దానిలో భాగంగా కోర్టులో దాఖలైన పిటిషన్ మేరకు ముగ్గురు బాలీవుడ్ అగ్రనతులకు కేంద్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.వీరిలో అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ షారుక్ ఖాన్ లు నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారని అలహాబాద్ హైకోర్టులకు బెంచ్ కు కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది తెలియజేశారు. హానికారక ఉత్పత్తులయిన గుట్కా కి సంబంధించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ మోతీలాల్ యాదవ్ అనే న్యాయవాది గతంలో అలహాబాద్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు.

గుట్కా ప్రకటన కేసులో ముగ్గురు బాలీవుడ్ అగ్రనటులకు  కేంద్రం షోకాజ్ నోటీసులు

భారత ప్రభుత్వం నుంచి గౌరవప్రదమైనటువంటి పురస్కారాలు అందుకున్నటువంటి వ్యక్తులు ఇలాంటి ప్రకటనల్లో పాల్గొనడం సరైన విషయం కాదని, ఇది సమాజానికి చెడు సంకేతాలను అందజేస్తుందని పిటిషన్ లో న్యాయవాది పేర్కొన్నారు. దీనిని విచారించినటువంటి కోర్టు పిటిషనర్ తరపున అభ్యంతరాలపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోయేసరికి పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనిపై కోర్టు స్పందిస్తూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సోలిసోటరి జనరల్ ఎస్బీ పాండే శుక్రవారం షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లకు అక్టోబర్ 22వ తేదీనే షోకాజు నోటీసులు జారీ చేశామని తెలిపారు. అయితే ఈ విషయం కాస్త ఆలస్యంగానే వెలుగులోకి వచ్చింది.

apnewshub.com 

Leave a Comment