MOVIES: శుక్రవారం వస్తుందంటే సినీ ప్రియులకు పండగే. అటు థియేటర్లలో కొత్త సినిమాలతో పాటు ప్రతివారం చాలా సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. వీటిలో చాలా వరకు తెలుగులో వచ్చేవి తక్కువగా ఇతర భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎక్కువగా ఉంటుంటాయి. అయితే కొన్ని ఫ్లాట్ ఫాంలు కొన్ని సినిమాలను, వెబ్‌సీరిస్ లను తెలుగులోకి అనువాదం చేసి విడుదల చేస్తున్నారు. తాజాగా ఓటీటీలోకి వచ్చిన డబ్బింగ్ సినిమాలు ఇప్పుడు చూద్దాం ..
ఈ వారం ఓటీటీలోకొచ్చిన మూవీస్..
కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ (Shiva Rajkumar) నటించిన తాజా చిత్రం ఘోష్ట్ (Ghost) ఆక్టోబర్‌లో థియేటర్లలోకి రాగా నవంబర్‌లో జీ5 (ZEE 5)లో కన్నడ భాషలో విడుదలైంది. ప్రస్తుతం తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది.ది ఎంజెల్ మేకర్ (The Angel Maker) అనే సైకలాజికల్ క్రైమ్ త్రిల్లర్ బుక్ మై షో స్ట్రీమ్ ఓటీటీలో రెంట్ పద్దతిలో తెలుగు ఇతర భాషలలో స్ట్రీమింగ్ జరుగుతున్నది.అలాగే క్యాండీ కేన్ లేన్ అనే అమెరికన్ క్రిష్టమస్ కామెడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, ఇతర భాషల్లో ప్రసారం అవుతున్నది. అంతేకాకుండా స్మగ్లర్ (Smugglers) అనే కొరియన్ మూవీ తెలుగు, ఇతర లాంగ్వేజేస్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నది. హరిసన్ ఫోర్డ్ ప్రధాన పాత్రలో ఇండియానా జోన్స్ సిరీస్‌కు ముగింపు పలుకుతూ వచ్చిన చివరి భాగం ది డయల్ ఆఫ్ డెస్టినీ (Indiana Jones And The Dial Of Destiny) డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్‌లో మల్టీ లాంగ్వేజెస్‌లో ప్రసారం అవుతున్నది. బ్రాడీనూన్, ఎమ్మా మైర్ నటించిన హాలీవుడ్ కామెడీ, ఫ్యామిలీ చిత్రం ఫ్యామిలీ స్విచ్ (Family Switch) తెలుగు,ఇతర భాషల్లో Netflixలో స్ట్రీమింగ్ అవుతున్నది. అదేవిధంగా ఈక్వలైజర్3 అనే హాలీవుడ్ యాక్షన్ సినిమా హిందీ, ఇంగ్లిష్ భాషల్లో Netflix లో స్ట్రీమింగ్ జరుగుతున్నది. ఇక మళయాళ థ్రిల్లర్, డ్రామా దూమం యాపిల్‌లో మల్టీ ఆడియోస్‌తో స్ట్రీమింగ్ అవుతున్నది..