సైబర్ మాసాలను అరికట్టే ఉద్దేశంతో టెలి కమ్యూనికేషన్ విభాగం (డాట్) డిసెంబర్ 1 నుంచి కొత్త సిమ్ కార్డులకు నిబంధనలను అమలు చేయడానికి సిద్ధమైంది. సిమ్ కార్డుల క్రయవిక్రయాలపై 2023 ఆగస్టులోనే కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. మోసపూరితమైనటువంటి పద్ధతుల ద్వారా ఇప్పటివరకు పొందిన 52 లక్షల పైగా సిమ్ కనెక్షన్లను డీయాక్టివేట్ చేసినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి అశ్విని వైష్ణవ్ తెలుపుతూ కొత్త నిబంధనలను ప్రకటించారు. కొత్త నిబంధనల ప్రకారం డీలర్లు అందరూ తప్పనిసరిగా సిమ్ లను వెరిఫికేషన్ చేయించుకోవాలని దీని పాటించకపోతే 10 లక్షల వరకు జరిమానా విధించబడుతుందని తెలిపారు. డిజిటల్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం బల్క్ కలెక్షన్ల జారీ నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది. అయితే ఒక గుర్తింపు ID ఆధారంగా వ్యక్తులు తొమ్మిది సిమ్ కార్డుల వరకు తీసుకోవచ్చు. అయితే సిమ్ కార్డు వెరిఫికేషన్ ఆపరేటర్ నిర్వహిస్తారు. ప్రస్తుతం అమ్మకందారుల రిజిస్ట్రేషన్ నిబంధనలను పాటించడానికి 12 నెలల సమయం ఉంది. ఈ నిబంధనల ముఖ్య ఉద్దేశం తప్పుడు అమ్మకందారులను గుర్తించడం, వారిని బ్లాక్ లిస్టులో పెట్టడం అని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.
Related Post