థియేటర్లో సినిమాలు సందడి ఎట్లా ఉన్నా ఓటీటిల్లో మాత్రం కొత్త సినిమాల సందడి ఎప్పటికప్పుడు ఉంటుంది. ఇంకా వెబ్ సిరీస్‌లతో కళకళడుతుంటాయి. ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్ సరికొత్త కంటెంట్ అందించడంలో ఒకదానికొకటి పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో ఓటీటీలు ఆడియన్స్ కు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్నాయి. ప్రతివారం ఏదో ఒక కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లను తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల శుక్రవారం సినిమాలకు సెంటిమెంట్ గా మారింది భారీ చిత్రాలను ఓటీటీలో శుక్రవారం రిలీజ్ చేస్తున్నారు. నవంబర్ 24 శుక్రవారంన 4 పెద్ద సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి.
భగవంత్ కేసరి
దీనిలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి. శ్రీల బాలకృష్ణ కూతురుగా నటించింది. యాక్షన్ సీన్స్ తో పాటు యాక్టింగ్ లో కూడా అదరగొట్టింది. దసరాకు రిలీజ్ అయిన ఈ మూవీ కలెక్షన్లలో దుమ్మురేపింది. ఈ మూవీ ఓటీటీ డేట్ గురించి అనేక పుకార్లు వచ్చినా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, హిందీ, మలయాళం భాషలలొ స్ట్రీమింగ్ అవుతుంది. ఓ రకంగా అమెజాన్ ని షేక్ ఆదిస్తూ బాలయ్య సత్తాను మరోసారి చూపింది.
లియో
దసరాకు రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సుమారుగా 600 కోట్లు పైగా వసూలు సాధించిన బ్లాక్ బాస్టర్ సినిమా లియో ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అనేకమంది అభిమానులు తెగ ఎదురు చూశారు. చివరకు నవంబర్ 24వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో స్ట్రీమింగ్ అవుతూ దుమ్ములేపుతుంది.
ది విలేజ్
తమిళ్ స్టార్ ఆర్య తొలిసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. “ది విలేజ్” అనే హారర్ వెబ్ సిరీస్ చేశాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ ప్రేక్షకులు బాగా భయపెట్టింది. ఈ సిరీస్ అమెజాన్ వీడియోలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబరు 24 నుంచి స్ట్రీమింగ్ అవుతూ అదరగొడుతుంది. మొత్తానికి ఈ సీజన్ ఓటీటీలో పెద్ద సినిమాల హవా కొనసాగుతుంది.