తెలంగాణల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం అయింది. రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలు కానుంది. ఈ నేపధ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు తరలి వెళ్తున్నారు.
తమకు ఇష్టమైన పార్టీని అధికారంలో నిలబెట్టుకునేందుకు ప్రజలు ఓటరు గుర్తింపు కార్డులను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో అనేక మందికి ఇంకా ఓటరు కార్డులు అందలేదు. ఒకవేళ మీరు కూడా కార్డు లేని వారి లిస్ట్‌లో ఉన్నట్లు అయితే.. ఓటర్ కార్డు ఇంకా రాలేదని దిగులు చెందకండి. మీ ఇంట్లోనే కూర్చొని మొబైల్లో ఓటరు గుర్తింపు కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా https://eci.gov.in/e-epic/ లింక్ పై క్లిక్ చెయ్యాలి. ఇండియన్ రెసిడెంట్ ఎలక్టర్ సెలక్ట్ చేసి, అడిగిన వివరాలు సమర్పించి మీ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానిని పోలింగ్ కేంద్రంలో చూపించి మీ ఓటు హక్కును దర్జాగా వినియోగించుకోవచ్చు.